Breaking News

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయింది.. అందుకు ఇదే నిదర్శనం

Published on Tue, 01/28/2025 - 16:02

సాక్షి,హైదరాబాద్‌ : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయింది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు బీఆర్‌ఎస్‌పై సెటైర్లు వేశారు.

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రఘునందన్‌ రావు మాట్లాడుతూ..ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్‌ఎస్‌ ముఖం చాటేసింది. కేసీఆర్‌  సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా?. ఎమ్మెల్సీ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. యువరాజు సమాధానం చెప్పాలి.

టీచర్స్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోవడం దారుణం. దేవిప్రసాద్ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వరు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు సీఆర్ఎస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పని అయిపొయింది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. బీఆర్‌ఎస్‌ తొకముడువడంతో బీజేపీ విజయం నల్లేరుమీద నడకయ్యిందని రఘునందన్‌ రావు వ్యాఖ్యానించారు. 

మరోవైపు, ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి (వరంగల్‌),  కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్య(పెద్దపల్లి), కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌  పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)