Breaking News

బీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయి 

Published on Sat, 09/09/2023 - 05:06

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మార్పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. సూర్యాపేట వేదికగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యపై మంత్రి జగదీశ్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్‌ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

వట్టె జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ పలు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జానయ్య సతీమణి రేణుక యాదవ్‌తో కలసి హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ..బీసీ వర్గానికి చెందిన వట్టె జానయ్య సూర్యాపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన మరుసటి రోజు నుంచి వారం రోజుల వ్యవధిలో ఆ వ్యక్తిపై 90 కేసులు పెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వట్టె జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయకుంటే సూర్యాపేటలో రెండు లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించి బీఆర్‌ఎస్‌కు వణుకుపుట్టిస్తామని మందకృష్ణ హెచ్చరించారు. ప్రతి సందర్భంలో తమను కాళ్లకు మొక్కేలా జగదీశ్‌రెడ్డి ప్రవర్తించారంటూ రేణుక యాదవ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం అంతరించిపోయిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. జానయ్య సోదరుడు కృష్ణయాదవ్, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)