Breaking News

Pulwama Assembly: పుల్వామాలో గట్టి పోటీ

Published on Tue, 10/08/2024 - 08:30

పుల్వామా: నేడు(సోమవారం) హర్యానాతో పాటు జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని 90 నియోజకవర్గాల్లో పుల్వామా అసెంబ్లీ స్థానం ఒకటి. పుల్వామా అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. ఈసారి పుల్వామా సీటుపై గట్టి పోటీ నెలకొంది.

నేషనల్ కాన్ఫరెన్స్ పుల్వామా సీటు నుంచి మహ్మద్ ఖలీల్ బంద్‌ను నిలబెట్టింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వాహిద్ పారాకు టిక్కెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండడంతో ఈ సీటు నేషనల్ కాన్ఫరెన్స్ ఖాతాలో చేరింది. ఈ స్థానానికి 1962లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ మాత్రమే ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తున్నాయి.ఈ సీటుపై బీజేపీ నేటికీ ఖాతా తెరవలేదు.

2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీడీపీకి చెందిన మహ్మద్ ఖలీల్ విజయం సాధించారు. పుల్వామా జిల్లా మొత్తం జనాభా 5.60 లక్షలు. జిల్లా  పరిపాలనా కేంద్రం శ్రీనగర్‌కు 31 కిలోమీటర్ల దూరంలో పుల్వామాలో ఉంది. జిల్లాలో 85.65శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో, 14.35శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం వరితో పాటు  నాణ్యమైన కుంకుమపువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.

ఇది కూడా చదవండి: Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)