Breaking News

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు అనాగరికం: ప్రియాంకా గాంధీ

Published on Sat, 07/27/2024 - 08:54

ఢిల్లీ: గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. గాజా విషయంలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వ తీరును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని ఆమె ఎక్స్‌ వేదికగా శుక్రవారం పిలుపునిచ్చారు.

‘ఇజ్రాయెల్‌ పౌరులు కూడా హింస, ద్వేషాన్ని నమ్మరు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలి.  ఇది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఇజ్రాయెల్‌ చర్యలు ఆమోదించదగినవి కావు. గాజాలో జరుగుతున్న భయంకరమైన మారణహోమం అందరూ ఖండించాలి. గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులు అనాగరికం.  గాజాపై  దాడులను ఇజ్రాయెల్‌ ప్రధాని  అనాగారికత, నాగరికత మధ్య ఘర్షణ అని అంటున్నారు.  కానీ, ఆయన, ఆయన ప్రభుత్వమే చాలా అనాగరికమైంది’అని ప్రియాంకా గాంధీ అన్నారు.

గత పది నెలల నుంచి హమాస్‌ మిలిటెంట్లను ఏరివేయటమే లక్ష్యంగా  ఇజ్రాయెల్‌ గాజాపై యుద్దం చేస్తోంది. ఇప్పటివరకు 40 వేల మంది గాజా పౌరులు మృతి చెందారు.   ప్రపంచంలోని పలు దేశాలు కాల్పుల విరమణ చేపట్టలాని కోరుతున్నా.. అమెరికా పర్యటనలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాత్రం గాజాపై యుద్ధాన్ని సమర్ధించుకోవటం గమనార్హం.


 

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)