Breaking News

రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ? త్వరలో అధికారిక ‍ప్రకటన?

Published on Mon, 04/08/2024 - 10:07

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత యూపీలోని రాయ్‌బరేలీ ఎవరిది? ఈ  ప్రశ్నకు కాంగ్రెస్ హైకమాండ్  త్వరలోనే జవాబు చెప్పనుంది. తాజాగా రాయ్‌బరేలీ ఎన్నికల బరిలో ప్రియాంక ప్రవేశానికి సంబంధించిన సూచనలు హై కమాండ్‌ నుంచి జిల్లా కార్యనిర్వాహకవర్గానికి అందిందనట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందట.

ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరేందుకు జిల్లా కమిటీ అధికారులు ఫిబ్రవరిలో ఆమెను కలుసుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాయ్‌బరేలీ సీటు ఎంతో  కీలకం. సమాజ్‌వాదీతో పొత్తు కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 17 సీట్లు దక్కాయి. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు మంచి సందేశం అందుతుందని, అది భారత కూటమికి మేలు చేస్తుందని కాంగ్రెస్ థింక్ ట్యాంక్ నమ్ముతోంది.

రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీకి.. ఆమె అమ్మమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీకి ఉన్నంత ఆదరణ ఉంది. ప్రియాంక తొలిసారి 1999 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాయ్‌బరేలీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ సతీష్ శర్మ  గెలుపు బాధ్యతను ప్రియాంక విజయవంతం చేశారు. రాయ్‌బరేలీ రాజకీయాలపై ప్రియాంకకు మంచి అవగాహన ఉందని విశ్లేషకులు చెబుతుంటారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)