Breaking News

తొమిదేళ్ళు పట్టిందా? అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ సీరియస్ 

Published on Thu, 09/21/2023 - 08:50

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు చర్చ సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కపటమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది. 2014 ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనే మహిళా రిజర్వేషన్ సాధిస్తామని హామీ ఇచ్చారని, అది జరిగిన తొమ్మిదేళ్లకు వారిలో చలనం వచ్చిందని అన్నారు. 

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కపటమైనవని తొమ్మిదేళ్ల క్రితం 2014లోనే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకోస్తామని ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చారని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇన్నాళ్లకు ఈ బిల్లుకు లోక్‌సభలో మోక్షం కలిగించారన్నారు. 

ఇక ఈ బిల్లు విషయంలో కూడా వారు కపట మాటలనే చెబుతున్నారు. ఈ బిల్లు చట్టంగా మారడమనేది జనగణన, డీలిమిటేషన్ వ్యవహారంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే వారు 2021 నుంచి జనగణన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. నాకు తెలిసి 2029 కంటే ముందు డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం లేదు. దాని తర్వాత జనగణన 2031లో చేయాల్సి ఉంటుంది. మొత్తంగా వారు మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లోనే మహిళలు వారికి గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. 

అంతకుముందు బిల్లుపై చర్చలు జరుగుతున్నసమయంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని ఎన్నికలు జరిగిన వెంటనే జనగణన, డీలిమిటేషన్‌ ప్రక్రియ మొదలుపెడతామన్నారు. దానికోసం అవసరాన్ని బట్టి చట్టంలో కొన్ని మార్పులు చేస్తామన్నారు. పారదర్శకత కోసమే డీలిమిటేషన్‌ చేయనున్నట్లు అమిత్‌ షా తెలిపారు. ఏయే స్థానాలు మహిళలకు కేటాయించాలనే దానిపై డిలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని, దానికి జనాభా లెక్కల సమాచారం మూలాధారమని అన్నారు. అందుకే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. 

ఇది కూడా చదవండి : Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)