Breaking News

విపక్షాలకు విజన్‌ లేదు, రోడ్‌మ్యాప్‌ లేదు

Published on Tue, 10/03/2023 - 05:35

జైపూర్‌/గ్వాలియర్‌: దేశ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలకు ఒక విజన్‌ లేదని, రోడ్‌మ్యాప్‌ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. రాజస్తాన్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ పరాజయం ఖాయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఓటమిని ముందే అంగీకరించారని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను బీజేపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేయొద్దని, ఎప్పటిలాగే కొనసాగించాలని, ఆ మేరకు గ్యారంటీ ఇవ్వాలని గహ్లోత్‌ ఇటీవల కోరారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందన్న సంగతి గహ్లోత్‌కు తెలిసిపోయిందని అన్నారు. మోదీ రాజస్తాన్‌లో రూ.7,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శాన్‌వాలియా శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిత్తోర్‌గఢ్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలకు మేలు చేకూర్చే ఏ పథకాన్నీ తాము రద్దు చేయబోమని, పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని తేలి్చచెప్పారు.   
భారత్‌ విజయాలను విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి   
ప్రతిపక్షాలు అభివృద్ధి వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దేశ అభివృద్ధిపై ప్రతిపక్షాలకు ఒక విజన్‌ గానీ, రోడ్‌మ్యాప్‌ గానీ లేదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో భారత్‌ సాధిస్తున్న విజయాలను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. మోదీ మధ్యప్రదేశ్‌లో రూ.19,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. కొన్ని ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. గ్వాలియర్‌లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ప్రశంసలు దక్కుతున్నాయని, ఈ నిజాన్ని ప్రతిపక్షాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలకు కేవలం అధికారం తప్ప ఇంకేమీ కనిపించడం లేదని ప్రధానమంత్రి  దుయ్యబట్టారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)