Breaking News

‘బీజేపీపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు.. అందుకే గెలుస్తోంది’

Published on Sun, 02/25/2024 - 13:36

బీజేపీపై ప్రముఖ్య ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ అభియాన్‌ సంస్థ వ్యవ‍స్థపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ విమర్శలు గుప్పించారు. దేశంలోని యువత సమస్యలు, నిరుద్యోగంపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రశాంత్‌ కిషోర్‌ మండిపడ్డారు. ఓ టీవీ చానెల్‌ నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్‌ కిషోర్‌ పాల్గొన్నారు. దేశంలోని యువతకు సంబంధిచిన సమస్యలపై బీజేపీ ఒక్కమాట కూడా మాట్లాడకుండా వరుసగా ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం చేప్పారు.

2014 నుంచి బీజేపీ పలు ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రతిపక్షాలు ఐకమత్యంగా లేకపోవటమే కారణమని తెలిపారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలు.. ఓటర్లకు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు వివరించటంలో విఫలం అయ్యాయి. ఓటర్లును తమవైపు మళ్లించుకోవటంలో ప్రతిపక్షాలు తరచూ వెనకబడటం వల్లే బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టుకుంటోందనిపేర్కొన్నారు. 

‘2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం వందమంది ఓటర్లలో సుమారు 38 మంది ప్రధాన మంత్రి మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలిచారు. కానీ, 62 మంది ఓటర్లు వ్యతిరేకంగా ఆయనక ఓట్లు వేశారు. మెజార్టీ ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలేకపోయారు. 62 మంది ఓటర్లు ప్రతిపక్షాల వైపు ఐక్యంగా ఉండలేకపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉ‍న్న మేజార్టీ ఓటర్లంతా కూడా చెల్లాచెదురుగా ఉన్నారు. ఎవరూ ప్రభుత్వ వ్యతిరేక మేజార్టీ ఓటర్లను ఒక్కతాటిపైకి తీసుకురాలేకపోయారు’ అని ప్రశాంత్‌ కిషోర్‌ వెల్లడించారు.

ఇక.. ప్రశాంత్‌ కిషోర్‌ ఇటీవల తన సంస్థ ‘జన్‌ సూరాజ్‌’ ద్వారా అత్యంత వెనబడిన తరగతులకు చెందిన సుమారు 75 మందిని 2025 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల బరితో దింపుతానని ప్రకటించారు. ప్రశాంత్‌ కిషోక్‌ ఎన్నికల వ్యూహకర్తగా బీజేపీ, జేడీ(యూ)- ఆర్జేడీ మహాఘట్‌బంధన్‌, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు అధికారంలోకి రావటానికి కృషి చేసిన విషయం తెలిసిందే.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)