బొద్దింకలను ఏరిపారేయండి.. మాజీ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Fri, 07/24/2026 - 18:38

న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంధ్ర ప్రదాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాక్రోచ్‌లను శాశ్వతంగా అంతం చేయాలని ప్రధాని మోదీని కోరారు.  

మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్ఞాఠాకూర్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో .. గతంలో ఎక్కడ బొద్దింకలు కనిపించినా వాటిని చీపురుతో ఊడ్చి పారవేసేవారని, కానీ ఇప్పుడు ఆ చీపురు, బొద్దింక స్నేహితులయ్యాయయని, తద్వారా దేశవ్యాప్తంగా మురికి వ్యాపిస్తోందని అన్నారు. ప్రధాని మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దేశ నాయకుడు ఇకపై చీపురును నమ్మకూడదు. దానికి బదులుగా, బొద్దింకలను నిర్మూలించడానికి శాశ్వత ఏర్పాట్లు చేయాలి. దేశాన్ని శుభ్రంగా ఉంచాలి’అని పేర్కొన్నారు.

ఠాకూర్ గతంలోనూ తన వ్యాఖ్యల కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఠాకూర్‌కు లోక్‌సభ టికెట్ నిరాకరించింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు, అశోక చక్ర గ్రహీత, మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్‌) చీఫ్ దివంగత హేమంత్ కర్కరేను, ఠాకూర్ పురాణాల్లోని ప్రతినాయకులైన రావణుడు, కంసుడితో పోల్చారు.

26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో కర్కరే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో కర్కరే తనను అన్యాయంగా ఇరికించారని.. తాను శపించడం వల్లే ఆయన చనిపోయారని’ఠాకూర్ ఆరోపించారు

మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిర్ధోషి
2008 సెప్టెంబర్‌ 29న మహారాష్ట్రలోని మాలేగావ్‌ ప్రాంతంలోని మసీదు సమీపంలో మోటర్‌ సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ప్రగ్యాసింగ్ ఠాకూర్‌తో సహా ఏడుగురు నిందితులను గతేడాది జూలై నెలలో నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది 

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)