Breaking News

‘విద్యుత్‌’ విచారణలో దాపరికం లేదు: తెలంగాణ సర్కార్‌ వాదనలు

Published on Fri, 06/28/2024 - 11:22

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టును తీర్పును రిజర్వ్‌ చేసింది. గత బీఆర్‌ఎస్‌​ పాలనలో విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన జ్యూడిషియల్‌ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

గురువారం సైతం ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగాయి. విద్యుత్‌ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటైందని కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. 

ఇవాళ ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి  వాదనలు వినిపించారు. ‘‘కమిషన్‌ ఏర్పాటు విషయంలో కోర్టులు కలుగజేసుకోలేవు. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. అందులో ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులున్నారు. ప్రభాకర్‌రావును సైతం విచారించింది. కేసీఆర్‌కు కమిషన్‌ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్‌ ఎన్నికల కారణంగా జూలై వరకు రావడం కుదరదని చెప్పారు. జూన్‌ 30 వరకు కమిషన్‌ గడువు ముగుస్తున్నందున జూన్‌ 15న రావాలని కోరాం.

వివరాలు ఎవరి ద్వారా అయినా పంపినా ఓకే.. లేదా కేసీఆర్‌ స్వయంగా వస్తానంటే ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని కమిషన్‌ అత్యంత మర్యాదపూర్వకంగా లేఖలో కోరింది. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించాయి. ఇది బహిరంగ కమిషన్‌. విచారణలో దాపరికం ఏమీ లేదు. జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ఎక్కడా పక్షపాత ధోరణితో మాట్లాడలేదు. విచారణకు రావాల్సిన వారికి 8బీ నోటీసులు జారీ చేసే అధికారం కమిషన్లకు ఉంటుంది. బీఆర్‌ఎస్‌ కూడా సభలో పలు విషయాలపై కమిషన్‌ ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొంది అని వాదించారు. 

ఈ క్రమంలో కేసీఆర్‌ పిటిషన్‌ విచారణ స్వీకరించవద్దని ఏజీ కోరగా.. పిటిషన్‌ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని,  మెరిట్స్‌లోకి వెళ్లవద్దని ఏజీకి ధర్మాసనం సూచించింది. 

మరోవైపు.. ఏజీ వాదనలపై కేసీఆర్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కమిషన్‌ సభ్యులు పక్షపాత వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జ్యుడిషియల్‌ విచారణగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పుడు.. నివేదిక ఇవ్వాలే తప్ప మీడియాకు వివరాలు వెల్లడించకూడదని, విద్యుత్‌ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి..  కారకులెవరో తేల్చమన్నారని, ఇది అసలు సరికాదని కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. 

ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్‌ చేసింది ధర్మాసనం. ఇవాళ లేదంటే సోమవారం తీర్పు వెల్లడిస్తామని జడ్జి తెలిపారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు