Breaking News

కేంద్రం సహాయ నిరాకరణ

Published on Sat, 10/02/2021 - 01:16

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి ఆర్థిక వనరులైన 4 ముఖ్య రాష్ట్రాల్లో మనది ఒకటని.. అయినా కేంద్రం తెలంగాణకు సహాయ నిరాకరణ చేస్తోందని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. అధికారం ఎవరికీ శాశ్వతంకాదని, రాష్ట్రం మాత్రం శాశ్వతమని గుర్తు పెట్టుకుని ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలివ్వా లని కోరారు. సీఎం ఇంత కష్టపడుతున్నా ప్రతిప క్షాలు అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని.. వాటిని పట్టించుకోమన్నారు.

అభివృద్ధిని జీర్ణించుకోలేక పాదయాత్ర పేర కువిమర్శలు చేస్తు న్నారని బీజేపీ ఉద్దేశించి పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధిపై శుక్రవారం శాసన మండలిలో స్వల్పకాలిక చర్చకు కేటీఆర్‌ సుదీర్ఘ సమాధానమిచ్చారు. 2030 వరకు రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో పురోభివృద్ధితో పరుగులు పెట్టిస్తామని, అప్పటిదాకా ప్రజలు తమనే గెలిపిస్తారనే సంపూర్ణ నమ్మకముందన్నారు. 

మాటసాయం లేదు.. మూటసాయం లేదు...
కేంద్రం నుంచి వచ్చేది ఏమీలేదని, మనమే వారికి ఇస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. ‘కేంద్రం నుంచి మాట సహాయం లేదు. మూట సహాయం’లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మూతపడిన మూడు చక్కెర పరిశ్రమలను ప్రభుత్వమే నడిపించే విషయంపై సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ అనే నాలుగో పారిశ్రామిక విప్లవానికి తగ్గట్లుగా ప్రణాళికలు, కార్యాచ రణతో ముందుకు వెళ్లాల్సి ఉంద న్నారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీ, ఇతర ప్రాంతాల్లో టీహబ్, వీహబ్‌ వంటివి, ఐటీ టవర్స్‌ నిర్మించి స్థానిక తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంఐఎం సభ్యుడు అఫెండీ కోరారు. ఈ చర్చలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, టీచర్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఆర్‌ఎస్‌ సభ్యులు భానుప్రసాద్, పురాణం సతీష్, తేర చిన్నపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

Videos

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)