Breaking News

అమిత్‌ షా Vs అఖిలేష్‌.. స్పీకర్‌ చైర్‌పై కామెంట్స్‌

Published on Thu, 08/08/2024 - 16:13

ఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీజేపీపై అఖిలేష్‌ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ అని విమర్శించారు. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు.

కాగా, పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా నేడు సభలో వక్ఫ్‌ బోర్డ్‌ సవరణ బిల్లును మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు సవరణలన్నీ కూడా కేవలం ఒక సాకు మాత్రమే. కేంద్రంలోని బీజేపీ పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. బీజేపీ అంటే భారతీయ జమీన్ పార్టీ. రక్షణ, రైల్వేలు, నాజుల్ ల్యాండ్ వంటి భూములను విక్రయించడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ ప్రయోజనాల కోసం పథకం అనే దాంట్లో ఇది మరో లింక్ మాత్రమే. వక్ఫ్ ‌బోర్డు భూములు అమ్మబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో స్పీకర్‌ ఓం బిర్లాపై కూడా అఖిలేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో మా హక్కులు, స్పీకర్‌ హక్కుల కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. బీజేపీ నేతలు స్పీకర్‌ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి జడ్డీగా వ్యవహరించే మీ హక్కులు కూడా వారే తీసుకుంటున్నారు అని కామెంట్స్‌ చేశారు. ఇక, అఖిలేష్‌ వ్యాఖ్యలకు అమిత్‌ షా కౌంటరిచ్చారు. సభలో అమిత్‌ షా మాట్లాడుతూ..‘ఇది స్పీకర్‌ చైర్‌ను అవమానించడమే. స్పీకర్ హక్కులు ప్రతిపక్షానికి చెందవు. సభ మొత్తానికి చెందుతాయి. ఇష్టానుసారం మాట్లాడకండి. మీరు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ.. చైర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదన్నారు.

 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)