అజారుద్దీన్‌కు కష్ట కాలం. మంత్రి పదవి ఉంటుందా?

Published on Sun, 04/19/2026 - 11:07

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆయన మంత్రి పదవికి సంకట పరిస్థితి వచ్చింది. మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ఈనెల 30తో అజారుద్దీన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కానుంది. దీంతో ఈనెల 30 లోపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ కాకుంటే.. మంత్రి వర్గం నుంచి ఆయనను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం ఫైల్‌పై గవర్నర్‌ను సంతకం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి కోరనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ కానున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై చర్చించనున్నారు. ఈ క్రమంలో గవర్నర్‌, సీఎం భేటీపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరు నెలల లోపు అసెంబ్లీ లేదా మండలికి  ఎన్నిక కావాలి. అత్యవసర పరిస్థితుల్లో లేదా పరిపాలనా సౌలభ్యం కోసం, అనుభవజ్ఞులను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించబడింది. కాగా, అంతకుముందు అజారుద్దీన్  అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన ఆరు నెలల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 30వ తేదీలోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే, సాంకేతికంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

ఎందుకు ఈ పరిస్థితి.. 
కాగా, రేవంత్‌ ప్రభుత్వం ఆయన పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించింది. అయితే.. గతంలో గవర్నర్ కోటా నామినేషన్లపై కోర్టులో వివాదాలు నడవటం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌తో చర్చలు జరిపి ఈ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కోటా క్లియర్ కాకపోతే.. ఖాళీగా ఉన్న ఏదైనా ఇతర ఎమ్మెల్సీ స్థానం.. స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోటా ద్వారా ఆయన్ని మండ‌లికి పంపాల్సి ఉంటుంది. ఇది కూడా ఫలించని నేపథ్యంలో అజారుద్దీన్‌ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)