Breaking News

పొలిటికల్‌ అలర్ట్‌.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్‌!

Published on Wed, 07/19/2023 - 08:44

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ జెట్‌ స్పీడ్‌లో దూసుకోపోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు హాజరు కానున్నారు. 

రేపు ఢిల్లీకి రేవంత్‌..
ఈ సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకే పార్టీ ముఖ్యులను కోమటిరెడ్డి లంచ్‌కు ఆహ్వానించారని తెలియవచ్చింది. త్వరలో పార్టీలో చేరే నాయకుల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకొనే దిశగా చర్చలు జరిపేందుకే ఈ భేటీ జరగనుందని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రేవంత్‌రెడ్డితోపాటు ఠాక్రే, ఇతర ముఖ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. గురువారం వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. ప్రియాంకా గాంధీ సమక్షంలో జూపల్లి, కూచుకుళ్ల బృందంతోపాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన పలువురు నేతలు కూడా వారితోపాటు వెళ్లి ఖర్గేను కలుస్తారని తెలుస్తోంది. 

కాంగ్రెస్‌లో భారీ చేరికలు.. 
ఇక, ఈ జాబితాలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, నల్లగొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఓ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్, ప్రముఖ ట్రావెల్స్‌ అధినేత, ఆదిలాబాద్‌కు చెందిన మరో కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం భేటీ అనంతరం కోమటిరెడ్డి నివాసంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారని, ఈ సమావేశంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్‌ నేతలు స్పష్టతనిస్తారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చదవండి: ‘కాంగ్రెస్‌లో చేరినందుకే కక్ష సాధింపు చర్యలు’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)