Breaking News

కాంగ్రెస్‌లో పొలిటికల్‌ వార్‌.. కొండా సురేఖపై చర్యలు తప్పవా?

Published on Sun, 06/22/2025 - 11:51

సాక్షి, వరంగల్‌/హైదరాబాద్‌: వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్‌ వార్ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు నేతలందరూ కూటమి కట్టారు. ఇక, తాజాగా హస్తం నేతల పంచాయతీ తాజాగా కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌ వద్దకు చేరుకుంది.

వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షీ నటరాజన్ భేటీ అయ్యారు. కడియం శ్రీహరి, కార్పొరేషన్ చైర్మన్, ఎర్రబెల్లి స్వర్ణ తదితర నేతలు మీనాక్షి నటరాజన్‌తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో చర్చలో​ ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటికే వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్‌కు సీనియర్ల నివేదిక అందింది. సీనియర్ల నివేదిక ఆధారంగా మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కొండా మురళి వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. 
అయితే, ఇన్ని రోజులు మంత్రి కొండా సురేఖ జిల్లాలో నేతలను కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి ఉంది. ఇదే సమయంలో తాజాగా మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి మరింత ఆజ్యం పోశాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతల్ని ఉద్దేశించి మురళి కామెంట్స్ చేశారు. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ.. మురళి అన్న ఆ మాటలే ఎమ్మెల్యేలందర్నీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా.. ఎవరి దారి వారిదే అన్నట్టున్నగా ఉన్న శాసనసభ్యులు.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్క తాటి మీదికి వచ్చినట్టు సమాచారం.

కొండా మురళి వ్యాఖ్యలతో.. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అంతా ఇప్పుడు ఏకమైనట్టు తెలిసింది. కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్‌రెడ్డితో కూడా కయ్యం మొదలైంది. ఇప్పుడు వరంగల్ సిటీలోని ఎమ్మెల్యేలతో పాటు.. కడియం శ్రీహరి లాంటి వాళ్ళంతా కలిసి కొండా దంపతులపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వీరంతా.. ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలకు మంత్రి మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు సమాచారం.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)