Breaking News

115 మంది పోలీసులు ‘అదృశ్యం’!

Published on Thu, 04/25/2024 - 18:31

దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపధ్యంలో యూపీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల కోసం యూపీలోని కాన్పూర్ నుంచి నోయిడాకు వెళ్లిన 115 మంది పోలీసులు అదృశ్యమైన ఉదంతం వెలుగు చూసింది. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ నోయిడా పోలీస్‌ డిప్యూటీ కమిషనర్ తనిఖీలో, కాన్పూర్ నుండి వచ్చిన 138 మంది పోలీసులలో 115 మంది అదృశ్యమైనట్లు తేలింది. ఈ పోలీసులకు దాద్రీలోని అన్షు పబ్లిక్ స్కూల్‌లో వసతి సౌకర్యం కల్పించారు. నోయిడా పోలీసులు ఈ గైర్హాజరైన పోలీసులపై కేసు నమోదు చేశారు. 

అలాగే ఈ విషయాన్ని డీజీపీ హెడ్‌క్వార్టర్‌లోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాగా ఇలాంటి  పలు ఘటనలు వెలుగులోకి రావడంతో, ఎన్నికల విధులకు హాజరైన పోలీసులను రోజువారీగా లెక్కించాలని అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లకు లా అండ్ ఆర్డర్ ఏడీజీ అమితాబ్ యష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అదృశ్యమైన పోలీసులు ఎన్నికల విధులకు గైర్హాజరై, వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)