Breaking News

పుట్టపర్తిలో రెడ్‌బుక్‌.. ఉషాశ్రీచరణ్‌ను అడ్డుకున్న పోలీసులు

Published on Mon, 08/25/2025 - 12:36

సాక్షి,శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీమంత్రి ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వెళ్లిన ఉషాశ్రీచరణ్‌ను అడ్డుకున్నారు. ఉషాశ్రీచరణ్ వెంట వచ్చిన వికలాంగులను కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో  పోలీసులు, మాజీ ఉషాశ్రీచరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఎదుట వికలాంగులు నిరసన తెలిపారు.

అనంతపురం: నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో వికలాంగులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు.  దీంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. వికలాంగులను ఈడ్చి పడేసిన పోలీసులు.. బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ ఎదుట వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెరిఫికేషన్ పేరుతో వికలాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడంపై వికలాంగులు మండిపడ్డారు. తక్షణమే కట్ చేసిన పింఛన్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వికలాంగులతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామంటూ దివ్యాంగులు హెచ్చరించారు.

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట దివ్యంగులు ధర్నా నిర్వహించారు. అర్హత ఉన్నా తమ పింఛన్లు ప్రభుత్వం తొలగించిందంటూ ఆందోళను దిగారు. దివ్యాంగులకు వైఎస్సార్‌సీపీ నేతలు మద్దతు ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్లు పునరుద్ధరించాలంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, గిరిజాల బాబు కలెక్టర్‌ వినతిపత్రం సమర్పించారు. 100 శాతం అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇచ్చి మరీ పెన్షన్ తొలగించడం దారుణమని దివ్యాంగులు మండిపడ్డారు.

కృష్ణా జిల్లా: తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన  చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నేత కిరణ్ రాజ్ ఆధ్వర్యంలో భారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్‌ను కలిసి తమ ఆవేదనను చెప్పుకుంటామని దివ్యాంగులు అంటున్నారు. శాంతియుతంగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని దివ్యాంగులు వేడుకుంటున్నారు.

Puttaparthi: ఈ బతుకు ఇంకెందుకు.. ఏదైనా విషం ఇచ్చి వికలాంగులను చింపేయండి

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)