Breaking News

ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద హైటెన్షన్‌

Published on Sun, 09/15/2024 - 11:43

సాక్షి,హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం(సెప్టెంబర్‌15) పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. డీసీపీ, ఏసీపీలతో పాటు భారీగా పోలీసులు గాంధీ నివాసం వద్ద మోహరించారు.  గాంధీ నివాసానికి రావాలని బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ శ్రేణులకు ఫోన్లు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. 

గాంధీ ఇంటి వద్ద  దాదాపు 300 మంది ఫోర్స్ ను అందుబాటులో ఉంచారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఒక్కసారిగా రావొచ్చని ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకే భద్రత పెంచినట్లు తెలుస్తోంది. గాంధీ నివాసం పరిసరాల్లో గత నాలుగు రోజులుగా పోలీసుల ఆంక్షలతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు.  గాంధీకి ఇంటి వెళ్లే దారిలో మొత్తం మూడు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో సవాళ్లు, ప్రతిసవాళ్ల తర్వాత గాంధీ అనుచరులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలు గాంధీ ఇంట్లో భేటీ అవుతామని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్‌  నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు చేశారు. దీంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు అనిపించినప్పటికీ తాజాగా బీఆర్‌ఎస్‌ నాయకులు మళ్లీ గాంధీ ఇంటికి రావొచ్చనే సమాచారంతో పోలీసులు మళ్లీ అప్రమత్తమయ్యారు. 

ఇదీ చదవండి.. ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రిక్తత

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)