తణుకులో పోలీసుల ఓవరాక్షన్‌..

Published on Wed, 12/31/2025 - 13:28

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్‌ విగ్రహం వద్ద 144 సెక్షన్‌ విధించారు. జనవరి 5న వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ చేస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించగా.. వైఎస్సార్‌ విగ్రహం చుట్టూ రెవెన్యూ అధికారులు ఇనుక కంచె వేశారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్సార్‌ విగ్రహాన్ని ప్రారంభిస్తామన్న కారుమూరి తేల్చి చెప్పారు. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి సహా 13 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. విగ్రహం వద్ద పోలీసులు పహారా కొనసాగుతుంది.

కాగా, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే తణుకు ప్రాంతం రాష్ట్రంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తణుకు వై.జంక్షన్‌లోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టి టీడీపీ సానుభూతిపరులు చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

వైఎస్సార్‌ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడంపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం, తమ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఆపై రెండు ఫ్లెక్సీలు పోలీసులు తొలగింపచేయడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)