Breaking News

Maharashtra Elections: స్కూటర్‌లో రూ. 1.5 కోట్లు.. కంగుతిన్న పోలీసులు

Published on Thu, 11/14/2024 - 12:09

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తేదీ  మరింత సమీపిస్తోంది. ఈ నేపధ్యంలో ఎన్నికల కోడ్‌ అమలవుతోంది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ, భారీగా నగదును  సీజ్ చేస్తున్నారు.

తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఆశ్చర్యకర ఉదంతం వెలుగుచూసింది. స్కూటర్‌పై  ఏకంగా రూ.1.5 కోట్లతో వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తాన్ని స్కూటర్‌పై తీసుకువెళ్లడాన్ని చూసిన పోలీసులు తెగ ఆశ్యర్యపోయారు. ఈ భారీ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు మీడియాకు సమాచారమిచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి కూడా తెలియజేశామన్నారు. పట్టుబడిన రూ.1.5 కోట్ల నగదును ఏదైనా అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారా లేదా ఎన్నికల్లో మనీలాండరింగ్‌కు సంబంధించినదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడు యశోధర నగర్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. అతనిని సెంట్రల్ అవెన్యూ ప్రాంతంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అనుమానితుడు స్కూటర్ ట్రంక్‌లో దాచిన రూ.1.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ వ్యక్తి సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయని, దీంతో తమకు అతనిపై అనుమానం పెరిగిందని పోలీసులు తెలిపారు. కాగా మహారాష్ట్రలో నవంబర్ 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇది కూడా చదవండి: ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)