Breaking News

కూలదోయబోయి కూలబడ్డారు

Published on Sun, 01/19/2025 - 05:27

పట్నా: వరుసగా రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచామన్న విజయగర్వంతో రాజ్యాంగాన్నే కూలదోసే సాహసంచేసి, మూడోసారి మెజార్టీ తగ్గడంతో మళ్లీ రాజ్యాంగం వద్ద ప్రధాని మోదీ ప్రణమిల్లారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. శనివారం పట్నాలోని చరిత్రాత్మక సదాఖత్‌ ఆశ్రమం వద్ద గాందీజీ విగ్రహం వద్ద నివాళులర్పించాక పార్టీ కార్యకర్తలతో ‘కార్యకర్తా సమ్మేళన్‌’తర్వాత ‘సంవిధాన్‌ సురక్షా సమ్మేళన్‌’సభల్లో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. 

రాజ్యాంగ ప్రతిని చేతబట్టుకుని ప్రసంగించారు. ‘‘మూడో సా రి కూడా మెజారిటీతో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టి ఉంటే ఈ రాజ్యాంగాన్ని కూలదోసేవారు. కానీ విపక్షాలు ఐక్యంగా పోరాడటంతో ఆయన కల లు కలగానే మిగిలిపోయాయి. 400పార్‌ నినాదాన్ని ఓటర్లు దారుణంగా తిరస్కరించడంతో మెజారిటీ తగ్గిపోయి మోదీ మళ్లీ రాజ్యాంగం వద్ద సాగిలపడ్డారు’’అని రాహుల్‌ అన్నారు. 

దీంతో అక్కడున్నవాళ్లంతా గొల్లున నవ్వారు. 543 సీట్లున్న లోక్‌సభలో 400కుపైగా సీట్లొస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని పలువురు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు ఎన్‌డీఏ కూటమి భారీ విజయశాతాన్ని తగ్గించేసిన సంగతి తెల్సిందే. ‘‘బుద్ధుడు, అంబేడ్కర్, నారాయణ గురు, మహాత్మా ఫూలేవంటి ఎందరో ప్రముఖుల ప్రగతిశీల భావనల నుంచే రాజ్యాంగం ఆవిర్భవించింది’’అని రాహుల్‌ అన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)