Breaking News

'ఒకే దేశంలో రెండు చట్టాలా..?' ప్రతిపక్షాలకు ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్..

Published on Tue, 06/27/2023 - 15:57

భోపాల్‌: భోపాల్ సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెరమీదకు తెచ్చారు. ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో మనిషికో చట్టం ఉండటం సబబు కాదని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని గుర్తు చేశారు. భోపాల్‌లో నిర్వహించిన 'మేరే బూత్ సబ్‌సే మజ్‌బూత్‌' కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో మాట్లాడారు. 

సమావేశంలో భాగంగా ట‍్రిపుల్ తలాక్‌పై కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో ఎవరి ప్రయోజనం కోసం ఇన్నాళ్లు ట్రిపుల్ తలాక్‌ను కొనసాగించారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈజిప‍్టు, ఇండోనేషియా, ఖతార్, జోర్డన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ వంటి ముస‍్లిం దేశాల్లో తలాక్‌ ఆచారాన్ని ఎప్పుడో రద్దు చేశారని గుర్తుచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రిపుల్ తలాక్‌ను కొనసాగించారని ప్రధాని దుయ్యబట్టారు. తలాక్ రద్దు చట్టం తేవడంతో ముస్లిం స్త్రీలకు స్వేచ్ఛ కల్పించినట్లు పేర్కొన్నారు. అందుకే ఎక్కడకు వెళ్లినా బీజేపీకి ముస్లిం మహిళలు అండగా ఉంటున్నారని చెప్పారు.  

తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ముస్లింలను రెచ్చగొడుతున్నారని ప్రధాని ఆరోపించారు. అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలని అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను ఉద్దేశిస్తూ.. దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం అవసరాన్ని రాజ్యాంగం కూడా తెలిపిందని ప్రధాని చెప్పారు. 

మతాలకతీతంగా అందరికీ ఒకే చట్టాలు అందుబాటులో ఉండేలా ఉమ్మడి పౌరస్మృతి సూచిస్తుంది. ఉత్తరఖండ్‌ ఇప్పటికే ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్‌ అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. లా కమిషన్ కూడా ఇటీవల ఈ చట్టంపై పనిచేస్తోంది. దేశంలో పలు మత సంస్థలను, ప్రముఖ వ్యక్తులను ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతిపై సూచనలను కోరింది.

ఇదీ చదవండి: కేసీఆర్‌ కుటుంబ రాజకీయాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)