Breaking News

మోదీ రాజీనామా.. 17వ లోక్‌సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

Published on Wed, 06/05/2024 - 13:13

న్యూఢిల్లీ:  నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం మధ్యాహ్నాం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా  సమర్పించారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మెజారిటీ చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆయన  17వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సందర్భంగా  రాష్ట్రపతి ముర్మును కోరారు. 

రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము.. లోక్‌సభ రద్దుకు సైతం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రిమండలి సమావేశమై 17వ లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేసింది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. సాయంత్రం ఎన్డీయే కూటమి నేతల సమావేశం జరగనుంది. ఆ వెంటనే రాష్ట్రపతిని కూటమి నేతలంతా కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని లేఖను అందించే అవకాశాలున్నాయి.

మోదీ ప్రమాణానికి ముహూర్తం
ఇక ఈ నెల 8న ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. కర్తవ్య్‌పథ్‌లో మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది.  అలాగే.. ఏడో తేదీన బీజేపీ, ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ భేటీలో లాంఛనంగా పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)