Breaking News

ఇది హర్యానా కార్యకర్తల విజయం: ప్రధాని మోదీ

Published on Tue, 10/08/2024 - 20:35

ఢిల్లీ: నవరాత్రి సమయంలో  హర్యానాలో​ బీజేపీ మూడోసారి విజయం సాధించటం శుభసూచకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.  హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

‘‘హర్యానా విజయం భరత ప్రజాస్వామ్య విజయం.  జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్‌-ఎన్సీ కూటమికి అధిక సీట్లు ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌లో గతంతో పోల్చితే బీజేపీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్-ఎన్సీ కూటమికి నా అభినందనలు. హర్యానాలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రతీ ఐదేళ్లకోసారిఓటరు ప్రభుత్వాన్ని మారుస్తారు. కానీ, ఈసారి  హర్యానా ప్రజలు బీజేపీ మూడో సారి విజయాన్ని కట్టబెట్టారు.  

.. హర్యానాలో కమలం మూడోసారి వికసించింది. కార్యకర్తల కృషితోనే హర్యానాలో విజయం సాధించాం. బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడిన చోట ప్రజలు మనకే మద్దతుగా నిలుస్తున్నారు.  హర్యానాలో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. అభివృద్ధిని చూసి ప్రజలు హ్యాట్రిక్‌ విజయం ఇచ్చారు. బలహీన వర్గాలను కాంగ్రెస్‌ ఓటు  బ్యాంక్‌గా చూస్తోంది. అధికారం తన జ‍న్మహక్కు అని కాంగ్రెస్‌ అనుకుంటోంది.

.. దేశ వ్యతిరేక రాజకీయాలు సహించబోమని  హర్యానా  ప్రజలు తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ కుట్రలను హర్యానా ప్రజలు కనిపట్టారు. కాంగ్రెస్‌ దేశంలో ప్రమాదకరమైన ఆటను మొదలుపెట్టింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌ భగ్గుమంటుందని అంతా అన్నారు. కానీ, మేము జమ్ము కశ్మీర్‌లో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రదర్శించాం. జమ్ము కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. 

..కాంగ్రెస్‌ పరాన్నజీవి పార్టీగా మారిపోయింది. పరాన్నజీవి అయిన కాంగ్రెస్‌ తన మిత్రపార్టీలనే నిర్వీర్యం చేస్తుంది. పలువర్గాల ప్రజలను రెచ్చగొట్టింది. కులం పేరుతో విషాన్ని చిమ్ముతోంది. ప్రజలను కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఈసీ పారదర్శకతనే ప్రశ్నిస్తోంది. మన వ్యవస్థల పారదర్శకతను వేలెత్తి చూపుతోంది. హర్యానాలో క్రీడల అభివృద్ధికి రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తాం’’ అని  అన్నారు.

ప్రధాన మోదీ ప్రసంగం కంటే ముందు కేంద్రమంత్రి జేపీ నడ్డా  మాట్లాడారు. ‘‘ ప్రధాని మోదీ నేతృత్వంలో హర్యానాలో ఘన విజయం సాధించాం. జమ్ము కశ్మీర్‌లో గణనీయమైన ఓట్లు సాధించాం. హర్యానా ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారు. కాంగ్రెస్‌ అబద్దాలు ప్రచారం చేసింది. హర్యానా ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్‌ విజయాన్ని కట్టబెట్టారు. ఈ విజయంలో పార్టీ కార్యకర్తలదే కీలక పాత్ర. కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. జమ్ము కశ్మీర్‌లో విజ​యం సాధించిన ఎన్సీ కూటమికి అభినందనలు’’ అని అన్నారు. ఈ సభలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జేపీ నడ్డా పాల్గొన్నారు.

చదవండి: తీర్పును అంగీకరించడం లేదు: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్‌

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)