Breaking News

‘నేను తాగే నీళ్లలో విషం కలిపారా?’

Published on Wed, 01/29/2025 - 15:14

ఢిల్లీ :  ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ (narendra modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ (aap) నేతలు బీజేపీపై అసహ్యకరమైన అభియోగాలు మోపుతుందని మండిపడ్డారు.

ఆప్‌ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్  ఎన్నికల ప్రచారంలో బీజేపీ విషం కలిపిన నీటిని ఢిల్లీ ప్రజలకు అందిస్తుందని ఆరోపించారు. అంతేకాదు, హర్యానా బీజేపీ ప్రభుత్వం విషయం కలిపిన నీటిని ప్రధాని మోదీ తాగగలరా? అని ఓటర్లను ప్రశ్నించారు.

అయితే, కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై మోదీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ ఘోండా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  ప్రధాని తాగే నీళ్లలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా..? అని ప్రశ్నించారు 

 ఆప్‌ నేతలు అసహ్యకరమైన అభియోగాలు మోతున్నారంటూ.. ఆ పార్టీ కన్వినర్‌ కేజ్రీవాల్‌పై మోదీ విరుచుకు పడ్డారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా యమునా (yamuna water) నీటిని తాగే నీరుగా మార్చి ఢిల్లీ ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ఏమైంది. నెరవేర్చలేదు. పైగా సిగ్గు లేకుండా ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో యమునా నీటి అంశాన్ని అడ్డం పెట్టుకొని తమకు ఓటేయ్యమని అడుగుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్ పాపాలు చేస్తోంది. అలాంటి వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు.. ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు’ అంటూ మోదీ దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా మోదీ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఇచ్చిన డెడ్‌లైన్‌పై పరోక్షంగా స్పందించారు. హార్యానాలోని బీజేపీ ప్రభుత్వం..అక్కడి నుంచి ఢిల్లీ ప్రవహించే నీటిలో అమోనియాను కలిపించదని ఆప్‌, కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన ఈసీ.. బుధవారం రాత్రి 8 కల్లా తగిన ఆధారాల్ని అందించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలపై మోదీ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ను టార్గెట్‌ చేశారు. గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నంలో.. నిందలు మాపై పడతాయని ఆశిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.  

వచ్చే వారం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అధికార పార్టీ గందరగోళంలో పడింది. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించకూడదా?  ఢిల్లీ ప్రజలతో ప్రధాని మోదీ తాగే నీటిని హర్యానా విషపూరితం చేయగలదా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. చివరిగా ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌,ఆప్‌ పాలన చూశారు. ఇప్పుడు బీజేపీకి ఓ అవకాశం ఇవ్వండి’ అని ఢిల్లీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.

👉చదవండి : మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని విచారం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)