Breaking News

రాహుల్‌, అఖిలేష్‌లది ఓ ఫెయిల్యూర్‌ సినిమా: మోదీ

Published on Sat, 04/06/2024 - 22:03

లక్నో: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్‌ యాదవ్‌లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ  విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడించటమే టార్గెట్‌గా ఇండియా కూటమిలో ఎస్పీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్‌, ఎస్పీ పొత్తు ఒక ఫెయిల్యూర్‌ సినిమా వంటిదని మోదీ ఎద్దేవా చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎస్పీ పెట్టుకున్న పొత్తు ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. ఇద్దరు బాలురి (రాహుల్‌, అఖిలేష్‌)సినిమా ఫెయిల్యూర్‌గా మిగిలిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు.

‘బీజేపీ 370 సీట్లు, ఎన్డీయే 400 సీట్లు గెలువకుండా ప్రతిపక్షాలు పోటి చేస్తున్న మొదటి ఎన్నికలు ఇవి. సమాజ్‌వాదీ పార్టీ.. కాగ్రెస్‌ కోసం గంట గంటకు అభ్యర్థులను మార్చుకునే స్థితిలోకి వెళ్లిపోయింది. వారి బలమైన స్థానాల్లో సైతం పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఎస్పీ ఉంది. ఇద్దరు బాలురి(రాహుల్‌, అఖిలేష్‌) సినిమా గతంలో ఫెయిల్యూర్‌ అయింది. అయినా మళ్లీ ఇప్పుడు జతకట్టారు’ అని మోదీ అన్నారు.

2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌లు ఇద్దరు సుమారు ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అగ్రాలో రోడ్డు షోలో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక..లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పోత్తులో భాగంగా మొత్తం 80 సీట్లలో ఎస్పీ-63 స్థానాల్లో, కాంగ్రెస్‌-17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)