Breaking News

మోదీ జోష్‌ షో

Published on Sat, 03/16/2024 - 03:50

సాక్షి, హైదరాబాద్‌: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్‌ షోకు వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన ఈ రోడ్‌షో పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్‌ నింపింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ఇతర వర్గాల వారు రోడ్డుకు ఇరువైపులా, ఇళ్లపై, షాపింగ్, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లపై నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీకి అభివాదం తెలిపారు.

అబ్‌కీ బార్‌ 400 పార్‌...(ఈసారి 400 సీట్లు దాటాలి) ఇతర నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రద ర్శించారు. ప్రధానిని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్‌షో సాగిన మార్గమంతా రెండువైపులా ఉన్న ప్రజలను మోదీ రెండు చేతులు ఊపుతూ పలకరించారు. ఈ సంద ర్భంగా డప్పు, డోలు, ఇతర వాయిద్య బృందాల ప్రదర్శనలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. 

నేడు నాగర్‌కర్నూల్‌కు మోదీ
కేరళ నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. మోదీ నేరుగా మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని మీర్జాల గూడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఓపెన్‌టాప్‌ వాహనంలో మల్కాజి గిరి దాకా దాదాపు 1.3 కి.మీ. దూరం రోడ్‌షో నిర్వహించారు. ఆయన వెంట జీప్‌లో ఓ వైపు కిషన్‌రెడ్డి మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మాత్రమే (ఇద్దరు భద్రతా సిబ్బంది మినహా) రోడ్‌షోలో పాల్గొన్నారు.

అంతకుముందు చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వేర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మాధవీలతలను మోదీకి పరిచయం చేశారు. ఈ రోడ్‌షో మొదలు, చివరి పాయింట్ల వద్ద పలువురు బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు స్వాగతం పలికేలా లైనప్‌లు ఏర్పాటు చేశారు. కాగా రోడ్‌షో ముగియగానే మోదీ రాజ్‌భవన్‌ బసకు చేరుకున్నారు. ప్రధాని శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్‌లో కర్ణాటకలోని గుల్బర్గా వెళతారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)