Breaking News

పాక్‌కు బాలాకోట్ దాడుల సమాచారం ఇచ్చాం: ప్రధాని మోదీ

Published on Tue, 04/30/2024 - 14:28

బెంగళూరు: లోక్‌సభ ఎ‍న్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 నాటి పాకిస్తాన్‌ బాలాకోట్‌పై జరిపిన సర్జీకల్‌ స్ట్రైక్స్‌ విషయాన్ని దాడి తర్వాత ఆ దేశానికి తెలిపామని అన్నారు. మంగళవారం కర్ణాటకలోని బాలాకోట్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు.

‘వెనక నుంచి దాడులు చేయడాన్ని మోదీ నమ్మడు. దేనినైనా ధైర్యంగా ముఖాముఖీ చేస్తాడు. బాలాకోట్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన తర్వాత మీడియాకు సమాచారం అందించాలని భద్రతా బలగాలు చెప్పాయి. ఈ విషయాన్ని అదే రాత్రి.. పాకిస్తాన్‌కు టెలిఫోన్‌ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేశాం. కానీ పాక్‌ టెలిఫోన్‌ కాల్‌కు స్పందించలేదు. తర్వాతే ఈ దాడుల విషయాన్నిప్రపంచానికి తెలియజేశాం. మోదీ ఎటువంటి విషయాన్ని దాచిపెట్టడు. ప్రతి విషయాన్ని బహిరంగంగా వెళ్లడిస్తాడు’ అని  ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో అమాయక ప్రజలకు బలి తీసుకోవాలనుకునేవారిని మోదీ హెచ్చరించారు. ఇది కొత్త భారత్‌ అని అన్నారు.

‘పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపినప్పుడు. చాలా మంది కర్ణాటకలోని బాలాకోట్‌ అనుకున్నారు. అందుకే వెంటనే తాము సర్జికల్‌ స్ట్రైక్స్‌ సంబంధించి మీడియాకు సమాచారం ఇచ్చాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక.. పుల్వామాలో  జైష్ ఎ మొహమ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతీకారంగా భారత బలగాలు పాక్‌లోని బాలాకోట్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)