Breaking News

‘మై డియర్‌ ఫ్యామిలీ మెంబర్‌’.. దేశ ప్రజలకు ప్రధాని లేఖ

Published on Sat, 03/16/2024 - 08:51

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడనున్న వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు. ‘మై డియర్‌ ఫ్యామిలీ’ మెంబర్‌ అని ఒక్కొక్కరనీ వ్యక్తిగతంగా సంబోధిస్తూ లేఖ మొదలు పెట్టారు. 140 కోట్ల మంది ప్రజలే తనకు స్ఫూర్తినిస్తూ ముందుకు నడుపుతున్నారని తెలిపారు.

‘ఈ పదేళ్ల పాలనలో ప్రజల సహకారంతో ఆర్టికల్‌ 370 రద్దు, జీఎస్టీ లాంటి ఎన్నో విజయాలు సాధించాం.  వికసిత్‌ భారత్‌ కలను నిజం చేయడానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వాలి. రైతులు, పేదలు, యువకులు, మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ పదేళ్లలో చాలా కృషి చేశాం. పీఎం ఆవాస్‌ యోజన,  ఇంటింటికి నీళ్లు, కరెంటు, గ్యాస్‌ అందించాం.

ఆయుష్మాన్‌ భారత్‌తో ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నాం. భారీగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మించాం. ట్రిపుల్‌ తలాక్‌, నారీ శక్తి వందన్‌ చట్టాలతో మహిళా సాధికారత కల్పించాం.  ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అందం. మీ మద్దతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి నాకు బలాన్నిచ్చింది. వికసిత్‌ భారత్‌కు మీ సలహాలు నాకు కావాలి. మనందరం కలిసి దేశాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తామన్న నమ్మకం నాకు ఉంది’అని మోదీ లేఖలో పేర్కొన్నారు. 

ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్ల స్కీమ్‌ ఉండాల్సింది.. అమిత్‌ షా 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)