Breaking News

క్రెడిట్‌ కోసం మోదీ ప్రయత్నం.. నితీష్‌ కుమార్‌ విమర్శలు

Published on Wed, 01/24/2024 - 19:41

పట్నా: స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన గుర్తింపుగా ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ విమర్శించారు. కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించటంపై మోదీ తనకే పూర్తి క్రెడిట్‌ దక్కాలని భావిస్తున్నారని అ‍న్నారు. దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నితీష్‌ కుమార్‌  పాల్గొని ప్రసంగించారు. 

కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటిస్తున్నట్లుగా ఆయన కూమారుడు, జేడి(యూ) నేత రామ్‌మత్ ఠాకూర్‌కు ప్రధాని మోదీ సమాచారం అదించారని తెలిపారు. ప్రధాన మంత్రి ఫోన్‌ చేసినట్లు రమ్‌మత్‌ ఠాకూర్‌ తనకు చెప్పారని అన్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం తనకు ఈ విషయాన్ని తెలియజేయలేదని చెప్పారు. అయితే తనకే పూర్తి క్రెడిట్‌ దక్కాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. ఏదేమైనా తమ పార్టీ సుదీర్ఘంగా చేసిన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేర్చిందని కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో పలుసార్లు తమ జేడీ(యూ) పార్టీ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించాలని డిమాండ్‌ చేసిందని గుర్తు చేశారు. తమ సంకల్పానికి దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌  ప్రేరణ అని అన్నారు. ఆయన వెనకబడిన, బలహీన వర్గ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఠాకూర్‌ స్పూర్తీతోనే తాము బిహార్‌లో కులగణన చేపట్టామని సీఎం నితీష్‌ కుమార్‌ తెలిపారు. 

ఇక.. ‘ఇన్నాళ్లకు దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ కపటత్వం బయటపడింది. ఇప్పటికైనా జన నాయకుడు ఠాకూర్‌కు భరత రత్న ప్రకటించటాన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తోంది’ అని కాంగ్రెస్‌ పార్టీ నేత  జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

చదవండి: ‘కాంగ్రెస్‌ పనికి రాని పార్టీ.. కూటమి అసహజమైంది’
 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)