Breaking News

West Bengal: ‘సందేశ్‌ ఖాలీ’పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 03/06/2024 - 13:24

కలకత్తా: బెంగాల్‌ పర్యటనలో ప్రధాని మోదీ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)పై నిప్పులు చెరిగారు. బుధవారం రాజధాని కలకత్తాలో దేశంలోనే తొలి అండర్‌ వాటర్‌ మెట్రో ప్రారంభించిన అనంతరం ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన మహిళాశక్తి ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘బెంగాల్‌లో టీఎంసీ హయాంలో మహిళలు వేధింపులకు గురయ్యారు. చిత్రవధ అనుభవించారు.

అధికార పార్టీ టీఎంసీ నేతలే స్వయంగా మహిళలను వేధించారు. టీఎంసీ మహిళలను ఎన్నడూ రక్షించలేదు. సందేశ్‌ఖాళీ ప్రాంతంలో జరిగిన దానికి ప్రతి ఒక్కరు సిగ్గు పడాలి. కానీ టీఎంసీ మాత్రం ఇవేవీ పట్టించుకోవడవం లేదు. బెంగాల్‌ ప్రజలను వేధించిన నిందితులను కాపాడాడానికి టీఎంసీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి చివాట్లు తిన్నది. సందేశ్‌ఖాలీ తుపాను బెంగాల్‌లో ప్రారంభమైంది.  ఈ తుపాను బెంగాల్‌లోని ప్రతి మూలకు చేరనుంది.

టీఎంసీ నేతలకు తమ అధినేత్రిపై పూర్తి నమ్మకం ఉంది కానీ బెంగాల్‌ మహిళలపై మాత్రం లేదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం లైంగికదాడులకు పాల్పడే వారికి జీవిత ఖైదు శిక్షలు పడేలా చట్టం తీసుకువచ్చింది. మహిళల ఫిర్యాదులను సులభంగా నమోదు చేసేందుకు కేంద్రం తీసుకువచ్చిన వుమెన్‌ హెల్ప్‌లైన్‌ను టీఎంసీ ప్రభుత్వం పనిచేయనివ్వడం లేదు. మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ పనిచేయలేదు’అని మోదీ మండిపడ్డారు. 

‘మోదీ పరివార్‌’ లాలూ వ్యాఖ్యలకు కౌంటర్‌ కాదు..

‘ఒక రాజకీయ నాయకుడు నాకు కుటుంబం లేదని అన్నందుకే నేను దేశమంతా నా కుటుంబమే అని నినాదమిస్తున్నాని కొందరు అనుకుంటున్నారు. వాళ్లకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నేను నా చిన్నతనంలోనే ఇళ్లు వదిలిపెట్టాను. నా దగ్గర అప్పుడు డబ్బులేదు. అయినా నేను ఏ రోజు ఖాళీ కడుపుతో పడుకోలేదు. ఆ సమయంలో పేద ప్రజలే నన్ను ఆదుకున్నారు. 

నా జీవితం దేశ ప్రజలకు అంకితం. నా శరీరంలోని ప్రతి అణువణువు, ప్రతి నిమిషం నా దేశ ప్రజల కోసమే. మోదీకి ఎప్పుడైనా సమస్య వస్తే ఈ తల్లులు,  సోదరీమణులే రక్షణ కవచంలా నిలిచారు’ అని మోదీ తెలిపారు.  

ఇదీ చదవండి.. ప్రధాని పర్యటన వేళ బీజేపీపై దీదీ ఫైర్‌ 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)