Breaking News

సందేశ్‌ఖాలీపై ఇండియా కూటమి మాట్లాడదేం: ప్రధాని మోదీ

Published on Fri, 03/01/2024 - 17:20

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం బెంగాల్‌లోని ఆరమ్‌బాగ్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు.

సందేశ్‌ఖాలీలోని  మహిళల బాధల కంటే కొంతమంది ఓట్లు సీఎం మమతకు ముఖ్యమా? అని బెంగాల్‌ ప్రజలు అడుగుతున్నారని మోదీ అన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై విమర్శలు  చేశారు. సందేశ్‌ఖాలీ మహిళల విషయంలో ఇండియా కూటమి మౌనం వహిస్తుందని మండిపడ్డారు.

బెంగాల్‌లో టీఎంసీ  (మాత, భూమి, ప్రజలు) అనే నినాదాన్ని పలుకుతుంది. అలాంటిది సందేశ్‌ఖాలీ మహిళల విషయంలో టీఎంసీ ఏం చేసింది.? అని మోదీ ప్రశ్నించారు. సందేశ్‌ఖాలీ ఘటనపై దేశం మొత్తం కోపంగా ఉందని తెలిపారు. ఈ వ్యక్తులు చేసే పనులు చేసి సంఘ సంస్కర్త రాజా రామోహన్‌రాయ్‌ ఆత్మ శోకిస్తుందని మోదీ మండిపడ్డారు.

ఇక.. సందేశ్‌ఖాలీ మహిళలపై లైంగిక దాడులు, వారి భూములును లాక్కోవడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలు ఉన్న టీఎంసీ నేత షాజహాన్‌​ ఖాన్‌ను పోలీసులు  అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్‌ అయిన షాజహన్‌ ఖాన్‌పై టీఎంసీ.. ఆరేళ్ల పాటు సస్పెన్షన్‌ విధించింది.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)