Breaking News

ముదురుతున్న వివాదం.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై పిటిషన్‌

Published on Sat, 12/07/2024 - 14:36

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది. విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన నిలిపివేయాలని జూలూరి గౌరీశంకర్‌ పిటిషన్‌ వేశారు. విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్త్వంపై జరుగుతున్న దాడిగా పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా? విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదంటూ మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా?’’ అంటూ ప్రశ్నించారు.

ఇదీ చదవండి: విగ్రహావిష్కరణకు రండి.. కేసీఆర్‌కు రేవంత్‌ సర్కార్‌ ఆహ్వానం

మరోవైపు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్‌ తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి.  చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.

విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్‌
 

 

 

 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)