Breaking News

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. పేర్ని నాని ఆసక్తికర ట్వీట్‌

Published on Sat, 07/06/2024 - 16:24

సాక్షి, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘‘తెలుగు న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోంది!’’ అంటూ ట్వీట్‌ చేశారు.

 

కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఈ రోజు.. ప్రజాభవన్‌ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు.

విభజన సమస్యలపై గతంలో అధికారుల స్థాయిలో దాదాపు 30 సమావేశాలు జరిగినా పెద్దగా ముందడుగు పడలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీఠ వేయడంతో సమస్యలు, అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. తాజా సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్‌ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, నగదు నిల్వల పంపకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అలా కుదరదని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేలకోట్లతో హైదరాబాద్‌లో ఆస్తులు ఏర్పడ్డాయని, వాటిలో వాటా కావాలని డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణ మాత్రం తమ భూభాగంలోని స్ధిరాస్తుల్లో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది. ఇక ఆర్టీసీ బస్‌భవన్, రాష్ట్ర ఆర్థికసంస్థ, ఉన్నత విద్యా మండలి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆస్తులు, దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్, ఉద్యోగుల పరస్పరం బదిలీ అంశాలు కూడా ప్రస్తుత భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)