Breaking News

మాపై నీకెందుకింత కక్ష?.. చంద్రబాబుపై పింఛన్‌దారుల ఆగ్రహం

Published on Tue, 04/02/2024 - 05:05

రాజమహేంద్రవరం సిటీ/పెదబయలు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ‘మాపై నీకెందుకింత కక్ష? వృద్ధుల విషయంలో కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావ్‌. పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకుంటావా?’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌ పింఛన్‌ కానుక లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జాంపేట గణేష్‌ చౌక్‌ వద్ద వందలాది మంది పింఛన్‌దారులు సోమవారం ఆందోళన చేశారు.

ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్లు తమ ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్‌ డబ్బులు చేతిలో పెట్టేవారని చెప్పారు. కానీ ఈ దుర్మార్గపు చంద్రబాబు చేసిన పని వల్ల ఈరోజు ఇంటి వద్ద పింఛన్‌ అందుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు పాలనలో అసలు పింఛన్‌ మంజూరవ్వడానికే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని.. పింఛన్‌ కోసం ఎండలో క్యూ లైన్లలో గంటల తరబడి పడిగాపులు పడేవాళ్లమంటూ గుర్తు చేసుకున్నారు. ఆకలి వేసినా, వడదెబ్బ కొట్టి పడిపోయినా, అనారోగ్యం వచ్చినా ఎవ్వరూ పట్టించుకునే వారు కాదన్నారు. అధికారం నుంచి దించేసినా చంద్రబాబుకు సిగ్గురాలేదని మండిపడ్డారు. కనీస మా­నవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని.. పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు.

చంద్రబాబు పాలన, ఆ జన్మభూమి కమిటీలను తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. టీడీపీ పాలనలో పింఛన్‌ కోసం కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ పాలన వచ్చాక ప్రతి నెలా క్ర­మం తప్పకుండా వలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇ­స్తున్నారని.. ఇంత చక్కని పాలన ఇంకెవ్వ­రూ అందిం­చలేరన్నారు. తమకు మళ్లీ జగన్‌ ప్రభుత్వమే కా­వాలంటూ నినాదాలు చేశారు. కాగా, కేంద్ర ఎన్ని­క­ల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్ర­త్యా­మ్నా­య మార్గాలు చూస్తోందని ఎంపీ భరత్‌ చెప్పారు.

బాబు నిర్వాకంతో 10 కిలోమీటర్లు నడవాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గోమంగి, గుల్లేలు పంచాయతీల పరిధిలోని పింఛన్‌దారులు సోమవారం సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీఎం వైఎస్‌ జగన్‌ తెచ్చిన వలంటీర్‌ వ్యవస్థ వల్ల ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారుజామునే వలంటీర్లు తమ ఇళ్లకు వచ్చి పింఛన్‌ ఇచ్చేవారని చెప్పారు. కానీ చంద్రబాబు చేసిన పని వల్ల ఏజెన్సీలో ఉండే తాము ఎంతో బాధపడాల్సి వస్తోందన్నారు.

గుల్లేలు పంచాయతీ కించూరు, బూరుగువీధి, పెదవంచరంగి, జంగంపట్టు గ్రామాలకు సుమారు 10 కిలోమీటర్ల దూరమని, గోమంగి పంచాయతీ కరుగొండ, బొండ్డాపుట్టు, కుంతురుపుట్టు, వన్నాడ, వంకరాయి గ్రామాలకు కూడా 9 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నిర్వాకం వల్ల తాము 10కిలోవీుటర్లు నడిచి వచ్చి సచివాలయంలో పింఛన్‌ తీసుకోవడం కష్టంతో కూడుకున్నదని వాపోయారు. చంద్రబాబు తప్పుడు ఫిర్యాదులను నమ్మవద్దని ఎన్నికల కమిషన్‌ను కోరారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)