Breaking News

మరో నాలుగేళ్లు రైతులకు ఇబ్బందులు తప్పవు: పెద్దిరెడ్డి

Published on Sat, 06/21/2025 - 15:56

సాక్షి, చిత్తూరు జిల్లా: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దారుణం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు బీవీరెడ్డి కాలనీలో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ముందుకు రావడం లేదన్నారు.

వైఎస్‌ జగన్‌ పాలనలో మామిడి రైతులకు మేలు జరిగింది. గత మూడేళ్లుగా కిలో మామిడి సరాసరి రూ.25 రూపాయలకు అమ్మకం చేశారు. గత ఏడాది కిలో మామిడి 27 రూపాయలుపైనే అమ్మకం చేశారు. కూటమి ప్రభుత్వం పాలనలో కిలో మూడు రూపాయలకు అమ్మకం చేద్దామన్న కొనుగోలు చేయని దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అన్న వ్యక్తి.. ఈరోజు రైతులకు ఏవిధం మేలు చేస్తాడు. రాష్ట్రంలో మామిడి, మిర్చి, పొగాకు, టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. మరో నాలుగేళ్లు రైతులకు ఈ పాలనలో ఇబ్బందులు తప్పవు’’ అని పెద్దిరెడ్డి అన్నారు.

రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం: మిథున్‌రెడ్డి 
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం జరుగుతోందని.. మామిడి, పాలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మామిడి రైతులు కిలో రూ.3 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమూల్ పాల డైరీ దెబ్బతీసి లీటర్ పాలకు 4-5 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజలు పక్షాన పోరాటం కొనసాగిస్తాం’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు.

ఏపీలో రైతుల అవస్థలపై ప్రభుత్వ నిలదీసిన YSRCP నేతలు

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు