Breaking News

అనితమ్మా.. ముందు ముందు చాలా ఉంది!

Published on Tue, 08/26/2025 - 10:01

కూటమి పార్టీలు తెలుగు దేశం, జనసేన మధ్య అక్కడక్కడా విబేధాలు రచ్చకెక్కుతుండడం చూస్తున్నదే. టీడీపీ వాళ్లు ఏం చేసినా చూస్తూ ఉండాలంటూ పరోక్షంగా ఆ పార్టీ అధినేత పవన్‌.. ప్రత్యక్షంగా ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చెబుతుండడం తెలిసిందే. ఈ తరుణంలో హోం మంత్రి వంగలపూడి అనితకు ఆమె సొంత నియోజకవర్గంలోనే జనసేన నేతల నుంచి వార్నింగ్‌ రావడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

సాక్షి, అనకాపల్లి:  కూటమి పార్టీలు తెలుగు దేశం, జనసేన మధ్య ఏపీలో పలు నియోజకవర్గాల్లో విబేధాలు రచ్చకెక్కుతుండడం చూస్తున్నదే. టీడీపీ వాళ్లు ఏం చేసినా చూస్తూ ఉండాలంటూ పరోక్షంగా ఆ పార్టీ అధినేత పవన్‌.. ప్రత్యక్షంగా ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో హోం మంత్రి వంగలపూడి అనితకు ఆమె సొంత నియోజకవర్గంలోనే జనసైనికులు వార్నింగ్‌ ఇచ్చారు.

పాయకరావుపేటలో అధికార పార్టీల మధ్య ప్రోటోకాల్ చిచ్చు రాజుకుంది. హోంమంత్రి అనిత తన సొంత నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫ్లెక్సీలో జనసేన ఇన్చార్జి గెడ్డం బుజ్జి ఫోటో లేకపోవడంతో జనసేన నేతలు మండిపడుతున్నారు. సోషల్‌ మీడియాలో అనితకు టార్గెట్‌ చేస్తూ నిన్నటి నుంచి వరుస పోస్టులు పెడుతున్నారు. 

‘‘అనితమ్మా.. ఈరోజుతో అయిపోయిందనుకుంటే అది మీ భ్రమ. ఇది అలా అయిపోయేది కాదు. ముందు ముందు చాలా ఎన్నికలు ఉన్నాయి’’ అంటూ వార్నింగ్‌ పోస్టులు చేస్తున్నారు. అదే సమయంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలంటూ కొందరు నేతలు బహిరంగంగానే అనితకు సూచిస్తున్నారు. పాయకరావుపేట సీటును అనితకు గెడ్డం బుజ్జి త్యాగం చేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

కూటమి అధికారం చేపట్టాక చాలా చోట్ల టీడీపీ వాళ్ల ఆధిపత్యమే కొనసాగడాన్ని జనసైనికులు భరించలేకపోతున్నారు. ఒక్క పాయకరావుపేటలోనే కాదు.. చాలాచోట్ల టీడీపీ జనసేనల మధ్య ఇలాంటి వైరమే కొనసాగుతోంది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)