Breaking News

నేను గెలుస్తానో లేదో..

Published on Fri, 05/03/2024 - 05:59

సాక్షి,విశాఖపట్నం/పాలకొండ/వీరఘట్టం: విశాఖ ఎన్నికల సభలో జనసేన అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. యువత గుండెల్లో నిప్పంటించడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. తనకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడు కూడా గుర్తుకు రాడంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదోనని.. పదవి వస్తుందో రాదోనని కూడా అనుమానం వ్యక్తంచేశారు. 

తాను నటుడిని కాకపోతే సాయుధ పోరాటంలోకి వెళ్లేవాడినన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. అంతా అవగాహన చేసుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చానని.. రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలని, అందుకే తాను గత ఎన్నికల్లో గాజువాక, భీమవరాల్లో ఓడిపోయినా బాధపడలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను యువత ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటున్నారని, ఆయనలో ఏముందని ప్రశ్నించారు. 

విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి జగదాంబ జంక్షన్‌లో కూర్చోబెడతానని, తొక్కేస్తానని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకపక్క ఆవేశంతోను, మరోవైపు నిర్వేదంతో ప్రసంగించిన పవన్‌ చెప్పిన అంశాలనే పదేపదే ప్రస్తావించి సభికులకు బోరు తెప్పించారు. పవన్‌ వచ్చిన కాసేపటికే జనం తిరుగు ముఖంపట్టారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలుచేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పవన్‌ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపెద్ద పోస్టర్లు వేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.  

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)