Breaking News

ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి

Published on Sun, 06/09/2024 - 05:53

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు జరపలేదని చెబుతున్నారు. మంత్రులుగా ఎవరిని తీసు­కోవాలనే దానిపై ప్రాథమికంగా ఒక అవగాహ­నకు వచ్చినా ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలే­దని సమాచారం. 

అయితే, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది తమకు అవకాశం ఇవ్వా­లని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డామని, ఎంతో చేశామని తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. నేరుగా ఆయన్ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. 

లోకేశ్‌ చుట్టూ చక్కర్లు..
చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్‌ పార్టీలో కీలకంగా ఉండడంతో అనేకమంది ముందు ఆయన్ను కలుస్తున్నారు. ఎన్నికలకు ముందు లోకేశ్‌ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వారంతా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. 

నిత్యం ఆయన్ను కలుస్తూ తమ గురించి ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అయితే, ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఎవరికీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్‌ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. జనసేన, బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుండడం, టీడీపీలోనే ఆశావహులు ఎక్కు­వగా ఉండడంతో ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఇంకా ఏమీ ఆలోచించలేదని సర్దిచెబుతున్నారు. 

తమ సంగతి చూడాలంటున్న సీనియర్లు..
ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకా­రం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గ కూర్పు­పై దృష్టిపెడతారని చెబుతున్నారు. భవిష్య­త్తులో తాము పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని, ఈ­సారి ఎలాగైనా మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలు­వురు సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు.

 గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, అయ్య­న్న­పాత్రు­డు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతలు ఈ కోవలో ఉన్నారు. సామాజికవర్గ నేపథ్య­ంలో తమకు అవకాశం ఇవ్వాలని బొండా ఉమామ­హేశ్వరరావు వంటి నేతలు గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో పార్టీ కోసం పని­చేసిన తమకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పయ్యా­వుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఒత్తిడి తెస్తు­న్నారు.

లోకేశ్‌పై ఆశలు పెట్టుకున్న జూనియర్లు..
మరోవైపు.. లోకేశ్‌ అండతో పార్టీలో ఎదిగిన నేతలు, ఆయన ద్వారా సీటు దక్కించుకుని గెలిచిన జూని­యర్లు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతుండడం చర్చనీయాంశమైంది. పెదకూర­పాడు నుంచి గెలిచిన భాష్యం ప్రవీణ్‌ వంటి నేతల ఇలాంటి వారిలో ఉన్నారు. అయితే, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని చూస్తామని మాత్రమే లోకేశ్‌ చెబుతున్నట్లు తెలిసింది. 

సీనియర్‌ నాయకు­లకు సైతం ఇప్పటివరకు మంత్రి పదవుల హామీ లభించలేదు. సాధారణంగా అయితే చంద్రబాబు ఈపాటికి మంత్రి పదవుల కోసం అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణలు, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికగా కసరత్తు చేయాల్సి వుంది. కానీ, ఇప్పుడు అదేమీ లేకపోవ­డంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఆయన మనసులో ఏముందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

సీనియర్లు తమకు అవకా­శం వస్తుందా? లేదా? అని చంద్రబాబుకి సన్ని­హితంగా ఉండే వారి నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రివర్గం, కీలక పదవుల గురించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడంతో పార్టీ నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)