Breaking News

ఆర్జేడీతో పొత్తు వద్దు.. మీరే గెలుస్తారు: కాంగ్రెస్‌కు సూచన

Published on Sat, 07/13/2024 - 21:28

ఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల స్థానాల్లో ఇండియా కూటమి 10 స్థానాల్లో విజయం సాధించింది.  ఎన్డీయే కూటమి రెండు చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒక సీటులో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేత, స్వతంత్ర ఎంపీ రాజేష్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో ఆర్జేడీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండటంపై కాంగ్రెస్‌ పార్టీ పునరాలోచించాలని కోరారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

‘‘అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా వచ్చాయి. వచ్చే జార్ఖండ్‌, మహారాష్ట్ర, హార్యానా ఎన్నికల్లో కూడా  ఇదే విధమైన ఫలితాలను ఇండియా కూటమి సొంతం చేసుకుంటుంది. అయితే బిహార్‌లో ప్రజలంతా.. జేడి(యూ) , ఆర్జేడీపై చాలా కొపంతో ఉన్నారు. దీంతో రాష్ట్రం రాజకీయంలో కొత్త పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ అర్థం చేసుకోవాలి.  ఆర్జేడీతో కూటమిపై  కాంగ్రెస్‌ పునరాలోచించాలి. నేను, కాంగ్రెస్‌ పార్టీ కలిసి బిహార్‌లో కొత్త కూటమిల ఏర్పాటు  చేస్తాం’’ అని పప్పూ యాదవ్‌ అన్నారు.

పప్పూ యాదవ్‌ లోక్‌సభ ఎన్నికలకు ముందు తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. పూర్ణియీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థి బీమా భారతిపై విజయం సాధించారు. 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)