Breaking News

తెలంగాణలో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన..

Published on Wed, 08/02/2023 - 18:30

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థులకు అందని విధంగా తమదైన రీతిలో ప్రజల వద్దకు వెళ్లడానికి నాయకులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ అధికార పీఠమే లక్ష‍్యంగా పావులు కదుపుతోంది. నియోజక వర్గాల స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 

రాష్ట్రంలో అధికార పార్టీకి ధీటుగా బదులు చెప్పగల సరైన ప్రత్యామ్నయం తామే అని చెప్పుతున్న బీజేపీ.. ఈ సారి ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించనుంది. ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీ నుంచి పర్యటనలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 119 నియోజక వర్గాలకు 119 మంది ఎమ్మెల్యేలు ఈ మేరకు పర్యటన చేయనున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 

ఒక్కో ఎమ్మెల్యే తమకు కేటాయించిన నియోజక వర్గంలో వారం రోజుల పాటు పర్యటించి, స్థానిక నాయకులను కలవనున్నారు. బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక అంశాలపై రిపోర్టును తీసుకుని అధిష్ఠానానికి సమర్పించనున్నారని సమాచారం. 

ఇదీ చదవండి: మోదీని కలవనున్న బండి సంజయ్‌.. ఏ రాష్ట్రం ఇస్తారో?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)