Breaking News

అఫ్జల్‌ గురు ఉరిశిక్ష వల్ల ప్రయోజనం లేదు: ఒమర్‌ అబ్దుల్లా

Published on Sat, 09/07/2024 - 08:43

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ​ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.  2001లో పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఘటనలోని దోషి అఫ్జల్‌గురుకు మరణశిక్ష విధించటంలో ఎటువంటి ప్రయాజనం లేదని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

‘అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించటంపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో శిక్ష విధించాల్సి ఉండేది. అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష వేయటంపై వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరులేదని నమ్ముతున్నా. ఉరిశిక్ష విధించడాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే కోర్టులు సైతం వందశాతం సరైన తీర్పులు వెల్లడిస్తాయని భావించలేము. మాకు సాక్ష్యాలను పదేపదే చూపించారు. ఇలా ఉరి శిక్ష విధించటాన్ని మాత్రం ఇతర దేశాలు సమర్థించలేదు’ అని అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికలవేళ ఒమర్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒమర్‌ అబ్దుల్లా అసెంబ్లీ ఎన్నికల్లో గందర్బాల్, బుద్గామ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాలలోను విజయం సాధిస్తామని  ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

డిసెంబర్‌13, ‌2001న పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్‌ గురుకు మరణశిక్ష విధించాలంటూ సెప్టెంబర్‌ 26, 2006న సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అనంతరం రాష్ట్రపతి క్షమాభిక్షకు ప్రయత్నించినప్పటికీ అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అఫ్జల్‌ గురు కుటుంబం అభ్యర్థనను తిరస్కరించారు.దీంతో  ఫిబ్రవరి 9, 2013న ఢిల్లీలోని తిహార్‌  జైలులో అఫ్జల్‌ గురుకి మరణశిక్ష అమలుచేశారు.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు