Breaking News

‘ఆర్టికల్ 370 రద్దుపై ఓటుతో కేంద్రానికి సందేశం పంపండి’

Published on Thu, 04/04/2024 - 11:05

శ్రీనగర్‌: 2024 లోక్‌సభ ఎన్నికలు జమ్మూ కశ్మీర్‌కు చాలా ముఖ్యమైనవని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత  ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ఈ ఎన్నికల ద్వారా కేంద్రానికి కశ్మీర్‌ ప్రజలు ఒక ప్రశ్నకు గట్టి సమాధానం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల ద్వారా 5 ఆగస్టు, 2019 రోజున కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైందా?.. కాదా? అనేది తెలియజేయాలన్నారు. బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఒమర్‌ అబ్దుల్లా పాల్గొని మాట్లాడారు. 

‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి మీది తీసుకున్న నిర్ణయం సరైందే అనిపిస్తే.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు ఓటు వేయకండి. మీ జీవితాలు గతం కంటే మేరుగ్గా మారినట్లు భావిస్తే మాకు ఓటు వేయకండి. కేంద్రం తీసుకున్న నిర్ణయం మనకు ఏమాత్రం ఆమెదయోగ్యం కాదని మీ ఓటు ద్వారా కేంద్రంలోని బీజేపీకి సందేశం పంపండి.

5, ఆగస్టు 2019న కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయమని భావిస్తే నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు  ఓటు వేయండి. నిరసన చేపట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఓటు ద్వారా కేంద్రానికి స్పష్టమైన సందేశం పంపాలి. మనం శాంతిని దూరం చేసే రాళ్లు విసిరే యువత కాదు. మనం శాంతిని నెలకొల్పడం కోసం త్యాగాలు చేసిన వాళ్లం’ అని ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. 

లోకసభ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది. శ్రీనగర్‌, బారాముల్లా, అనంత్‌నాగ్‌ పోటీ చేయగా.. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీకి జమ్ములోని రెండు స్థానాలు దక్కాయి. అయితే పీడీపీ పార్టీ ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించటం గమనార్హం. అయితే పొత్తులో భాగంగా అనంత్‌ నాగ్‌ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందిగా పీడీపీ డిమాండ్‌ చేసింది.

ఈ ప్రతిపాదనపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే అక్కడి నుంచి పీడీపీ చీఫ్‌​ మెహబూబా ముఫ్తీ పోటి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్‌లో ఏప్రిల్‌ 19నుంచి మే 20 వరకు ఐదు దఫాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జూన్‌ 4న వెలువడనున్నాయి.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)