Breaking News

ఆయన పీఎం అయితే నేను ఎమ్మెల్యే కాలేనా?

Published on Fri, 05/10/2024 - 14:43

పూరీ (ఒడిశా): ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో ఒడిశాకు చెందిన ఓ ఛాయ్‌వాలా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. టీ అమ్ముతూ జీవనం గడుపుతున్న 26 ఏళ్ల సుకాంత ఘడాయ్ పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

కరీంపూర్ గ్రామానికి చెందిన ఘడాయ్ తనకు స్థిర, చర ఆస్తులు ఏమీ లేవని తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఘడాయ్ తనకు ప్రధాని నరేంద్ర మోదీనే స్ఫూర్తి అని, ఆయన ప్రధాని కాగలిగితే, తోటి ఛాయ్‌వాలా అయిన తాను ఎమ్మెల్యే కాలేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే లంచాల సంస్కృతిని అరికట్టి నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతానని, అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడాన్ని పరిష్కరిస్తానని తన ప్రణాళికను ప్రకటించారు. తాను సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా సుకాంత ఘడాయ్ చెబుతన్నారు.

కాగా బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార బీజేడీ అభ్యర్థి ఉమాకాంత సామంతరాయ్, బీజేపీకి చెందిన ఉపాస్నా మహపాత్ర, కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రభాను మోహపాత్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ మే 25న పోలింగ్ జరగనుంది.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)