Breaking News

ఒడిశా అధికార పార్టీ బీజేడీకి ఎదురు దెబ్బ

Published on Sat, 03/16/2024 - 11:25

సాక్షి, భువనేశ్వర్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ)కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ ఒడియా నటుడు, బీజేడీ నేత అరిందమ్ రాయ్ బీజేపీలో చేరారు.  

‘బీజేడీలో ఉన్నప్పుడు నేను సీఎం నవీన్ పట్నాయక్‌ను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. అయితే, పార్టీ రాజకీయాల కారణంగా నేను సీఎంను కలిసే అవకాశం పొందలేకపోయాను. ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో బీజేపీలో చేరానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటూ పార్టీ  మారడానికి గల కారణాల్ని వెల్లడించారు. 

ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం చుబా అవో ఒడిశా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్‌ పట్నాయక్‌ తన పరిపాలనలో.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తామే ప్రవేశ పెట్టినట్లు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశ అభివృద్ది కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం అన్న ఆయన..ఈ సారి ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్‌ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో 
ఒడిశాలో 21 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజూ జనతాదళ్ (బీజేడీ) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీజేడీ 12 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 8 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్‌ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 
రాష్ట్రంలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 113 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 23 స్థానాల్లో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ 9, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1, స్వతంత్ర అభ్యర్థి మరో సీటుతో రెండో స్థానంలో నిలిచారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)