Breaking News

అట్టుడుకుతున్న మణిపూర్‌.. సంగ్మా కీలక నిర్ణయం

Published on Sun, 11/17/2024 - 19:56

న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలోని మణిపుర్‌ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మా ఆదివారం(నవంబర్‌ 17) ప్రకటించారు.‘మణిపూర్‌లో  సంక్షోభాన్ని పరిష్కరించడంలో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజా హింసాత్మక ఘటనల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మా మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఎన్‌పీపీ తెలిపింది. మణిపుర్‌ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లున్నాయి. వీటిలో 53స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఈ 53 సీట్లలో ఎన్‌పీపీకి ఏడు సీట్లున్నాయి.

హింసాత్మక ఘటనల నేపథ్యంలో మణిపుర్‌ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా  సమీక్ష నిర్వహించారు. ఆదివారం(నవంబర్‌ 17)ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్‌ షా ఈ సమావేశాన్ని నిర్వహించారు. కాగా, మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌తోపాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై నిరసనకారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
 

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు