ప్రధానిని కించపరచలేదు

Published on Sun, 08/13/2023 - 05:25

న్యూఢిల్లీ: మణిపూర్‌ హింసపై లోక్‌సభలో మాట్లాడనందుకే నీరవ్‌ అనే మాటను వాడాను తప్ప, ఆయన్ను కించపరచడానికి కాదని కాంగ్రెస్‌ ఎంపీ ఆధిర్‌ రంజన్‌ చౌదరి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్‌ హింసపై ప్రధానమంత్రి మాట్లాడాలని కాంగ్రెస్‌ పార్టీ మొదట్నుంచీ డిమాండ్‌ చేస్తోందని చెప్పారు. ప్రధాని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయే సరికి ‘నీరవ్‌’అనే మాటను వాడానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు.

నీరవ్‌కు నిశ్శబ్దం అనే అర్థం ఉందన్నారు. పార్లమెంట్‌లో ఎవరినైనా అగౌరవపరచాలనే ఆలోచన తనకు లేశ మాత్రమైనా లేదని చెప్పారు. ఏదైనా మాట అన్‌ పార్లమెంటరీగా అనిపిస్తే తొలగించేందుకు నిబంధనల ప్రకారం స్పీకర్‌కు అధికారముందని చౌదరి తెలిపారు. ఒకరి ప్రతీకార, అహంకార వైఖరికి తానెందుకు క్షమాపణ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షం గళం వినిపించకుండా చేసేందుకే బీజేపీ నేతలు పథకం ప్రకారం అనుచిత విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు.

తన సస్పెన్షన్‌ను తిరోగమన చర్యగా ఆయన అభివర్ణించారు. ఉరితీసిన తర్వాత విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో తనను ఉంచారంటూ వ్యాఖ్యానించారు. సస్పెన్షన్‌పై చట్టపరంగా ముందుకెళ్లేందుకు గల అవకాశాలను పరిశీలిస్తానన్నారు. అనుచిత ప్రవర్తన కారణంతో అధిర్‌ రంజన్‌ చౌదరిని గురువారం లోకసభ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై సభా హక్కుల కమిటీ నివేదిక ఇచ్చేవరకు సస్పెన్షన్‌ కొనసాగనుంది.  భారత్, ఇండియా ఒక్కటే అయినప్పుడు ప్రధాని మోదీ మాత్రం ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి పేరును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని ఆధిర్‌ రంజన్‌ చౌదరి అన్నారు. ‘అంత శక్తిమంతుడైన మోదీకి ఇండియా పదంతో వచ్చిన ఇబ్బందేమిటి? భారత్, ఇండియా రెండూ ఒక్కటేనని రాజ్యాంగం కూడా చెప్పింది. అయినా బీజేపీ నేతలు రెండింటి మధ్య తేడాలు చూపిస్తున్నారు’అని అధిర్‌ రంజన్‌ చౌదరి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఘర్షణలకు మణిపూర్‌ పరిణామాలకు పోలిక లేదని, అక్కడ మానవీయ సంక్షోభం నెలకొని ఉందని చెప్పారు. మణిపూర్‌లో పరిస్థితులు దేశంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్రం భావిస్తే పరిష్కరించేందుకు మరింతగా కృషి చేయాలని సూచించారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)