Breaking News

ఎన్నికల్లో అలాంటి వాటికి తావులేదు.. సీఈసీ కీలక వ్యాఖ్యలు

Published on Tue, 03/05/2024 - 17:55

దేశంలో ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలైపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ జెండా ఎగురవేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక నేతల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్ని పార్టీలకు సరైన ప్రాధాన్యత ఉండేలా పశ్చిమ బెంగాల్ బ్యూరోక్రసీకి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి హింసాకాండకు తావు లేదని, ఆలా జరిగితే సహించేది లేదని చీప్ ఎలక్షన్ కమిషనర్ ఈ రోజు (మంగళవారం) ప్రకటించారు.

విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, హింస రహిత ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని.. ఎన్నికల్లో భయానికి, బెదిరింపులకు తావు లేదని, అధికార యంత్రాంగం పక్షపాత ధోరణిని సహించేది లేదని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి

పశ్చిమ బెంగాల్‌లో తగిన సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరిస్తామని, దీంతో తప్పకుండా ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఆయన అన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు చెప్పినట్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుంటే.. ఆ తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాజీవ్ అన్నారు. కాబట్టి పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలని, జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)