Breaking News

అది ఎవరూ అంగీకరించరు: కాంగ్రెస్‌ చీఫ్‌ వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌

Published on Thu, 11/21/2024 - 16:51

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోనే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ చీఫ్‌ నానా పటోలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ 25న కాంగ్రెస్‌ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే వ్యాఖ్యలను శివసేన(ఉద్దవ్‌) రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని అన్నారు.

ఈ మేరకు ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్‌ మాట్లాడుతూ.. సీఎం ఎవరన్నదనే విషయం కూటమి భాగస్వామ్యాలతో సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను దీన్ని అంగీకరించను. ఎవరూ కూడా అంగీకరించరు. నానా పటోలేకు కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఉందో లేదో మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాము. పటోలే ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పాలి. రాహుల్‌ గానీ ప్రియాంక గాంధీ వాద్రాగానీ, సోనియా గాంధీగానీ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు.

అయితే మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి రాష్ట్రంలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చీఫ్ నానా పటోలే తెలిపారు. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని  చెప్పారు. నవంబర్ 25న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని అంచనా వేశామని, కానీ తాము ఓడిపోయామని చెప్పారు. ఈసారి కాంగ్రెస్‌ ఓటమిని వారు అంచనా వేస్తున్నారు కాబట్టి తామే తప్పకుండా గెలుస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌), శివసేన (షిండే వర్గం) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అనేక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఇక ప్రతిపక్ష కూటమి అయిన ఎంవీఏ(కాంగ్రెస్‌, శివసేన(ఉద్దవ్‌), ఎన్సీపీ(శరద్‌పవార్‌) ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ అధికారాన్ని దక్కించుకోలేదని అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగాల్సి ఉంది.

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)