Breaking News

‘పశ్చిమ బెంగాల్‌’ పేరు మార్చండి: సీఎం మమతా డిమాండ్‌

Published on Fri, 01/12/2024 - 19:34

తమ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. బొంబాయి పేరును ముంబయిగా ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చేస్తే లేని తప్పు.. పశ్చిమ  బెంగాల్‌ను బంగ్లాగా మారిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఈ మేరకు కల్‌కత్తాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మమతా మాట్లాడుతూ.. రాష్ట్రం పేరు మార్చేందుకు గతంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని తెలిపారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల వివరణలు ఇచ్చామని, అయినా చాలా కాలంగా రాష్ట్ర పేరును బంగ్లాగా మార్చలేదని మండిపడ్డారు. బొంబాయి, ఒరిస్సా పేర్లను మార్చినప్పుడు.. పశ్చిమ బెంగాల్‌ పేరు మార్చడానికి అభ్యంతరం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. ఇంగ్లీష్‌ అక్షరమాల ప్రకారం జాబితాలో తమ రాష్ట్రం పేరు చివరగా ఉంటుందని, దాంతో సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు ఆఖరివరకు వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు.

రాష్ట్ర పేరును పశ్చిమ బెంగాల్ కంటే అక్షర క్రమంలో ముందున్న బంగ్లాగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలకు మమతా వివరించారు. రాష్ట్ర విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు, ఉన్నత విద్యలు అభ్యసించేందుకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ప్రతి సందర్భంలోనూ చివరి వరకు వేచి చూడాల్సి వస్తుందని(ఇంగ్లీష్‌ అక్షరమాల క్రమంలో W, X, Y, Z), దీని వల్ల బంగ్లా ప్రాముఖ్యత తగ్గుతోందన్నారు. రాష్ట్రం పేరులో ‘పశ్చిమ’ అని చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మార్చడం వల్ల నష్టం ఏం లేదని తెలుపుతూ ఓ ఉదాహణ చెప్పారు. ‘ పాకిస్థాన్‌లో పంజాబ్‌ అనే ప్రావిన్స్‌ ఉంది. భారత్‌లోనూ పంజాబ్‌ పేరుతో రాష్ట్రం ఉంది. ఇందులో ఏ సమస్యల ఏదు. అలాంటప్పుడు బంగ్లాదేశ్‌ పేరుతో ఓ దేశం ఉంటే.. పశ్చిమ బెంగాల్‌ బంగ్లాగా ఎందుకు మారకదు’ అని తెలిపారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)